IPL 2024 : ఈ సీజన్ లో కావ్య మారన్ అదృష్ట రేఖ జెర్రిగొడ్డులా ఉందట.. జ్యోతిష్యాలు నిజమవుతాయా?

ఐపీఎల్ సీజన్ లో అత్యంత అదృష్టవంతులైన టీం ఎవరిది అని చెబితే సన్ రైజర్స్ హైదరాబాద్ అని ఠక్కున చెబుతారు

Update: 2024-05-25 02:48 GMT

ఐపీఎల్ సీజన్ లో అత్యంత అదృష్టవంతులైన టీం ఎవరిది అని చెబితే సన్ రైజర్స్ హైదరాబాద్ అని ఠక్కున చెబుతారు. ఎందుకో ఈ సీజన్ అంతటా ఆ జట్టు అనుకోని విజయాలను అందుకుంటూ వస్తుంది. జెర్సీ మారినందునో ఏమో.. లేక కెప్టెన్సీ మార్చినందునో తెలియదు కానీ.. ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి నుంచి మంచి పెర్ ఫార్మెన్స్ చూపుతుంది. రికార్డులను నమోదు చేస్తూ ఐపీఎల్ చరిత్రనే తిరగ రాసింది. గత సీజన్ లలో అట్టర్ ఫ్లాప్ అయిన ఆటగాళ్లు ఈ సీజన్ లో రెచ్చిపోవడం అది సంకేతంగానే భావించినట్లుంది. అందుకే మొదటి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంటుందని అందరూ అంచనాలు వేశారు.

కెమెరాల ఫోకస్...
అయితే ఆరంభంలో కొంత తడబడినా ఆ తర్వాత తేరుకుని ఎన్నడూ లేని విధంగా ఆడగలిగింది. అవతల జట్టు ఏదని చూడలేదు. బాదుడే పనిగా పెట్టుకుంది. ముంబయి ఇండియన్స్ పై 277 పరుగులు చేసింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై 287 పరుగులు చేసింది. ఇంకా ఈ టీం ఈ సీజన్ లోనే వంద సిక్స్ లు పైగానే కొట్టిందంటే చూడాలి ఇక. హెడ్, అభిషేక్ శర్మ, త్రిపాఠి, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సమద్, షాబాజ్ అందరూ హిట్టర్లే కావడంతో రికార్డుల మోత మోగించింది. చూసేవారికి కూడా ఆశ్చర్యంకలిగించేలా అదరగొట్టేలా ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడింది. అందుకు కమిన్స్ నాయకత్వంతో పాటు సమిష్టిగా ఆటగాళ్లు రాణించడమే ముఖ్య కారణంగా చెప్పాలి.
నెత్తుటి చుక్క లేదంటే...?
ఇక శుక్రవారం జరిగిన చివరి క్వాలిఫయిర్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడటం చూసి జట్టు యజమాని కావ్యమారన్ మొహంలో నెత్తుటి చుక్కలేదంటే నమ్మాలి. సన్ రైజర్స్ ఆటగాడు అవుటయినప్పుడల్లా కెమెరాలు ఆమె ఫీలింగ్స్ ను క్యాచ్ చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాయంటే అతిశయోక్తి కాదు. కావ్యమారన్ కూడా ఈ మ్యాచ్ పై ఆశలు వదులుకున్నట్లే కనిపించింది. అనుకున్న స్కోరు రాకపోవడంతో కేవలం 175 పరుగులకే అవుట్ కావడంతో ఇక ఫైనల్స్ కు వెళ్లలేమని ఆమె డిసైడ్ అయింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ వికెట్లు వరసగా పడిపోతుండటంతో ఆమె ముఖంలో తేజస్సు కనిపించింది. గెలుపు మన ఇంటి తలుపు తడుతుందని భావించి ఇక హుషారుగా ఎగిరి గంతులే వేసింది. వికెట్ పడినప్పుడల్లా ఆమె ఉత్సాహాన్ని చూసిన వారికి ఎవరికైనా ఈ సీజన్ లో కావ్యమారన్ కు అదృష్టం మామూలుగా లేదు అని వ్యాఖ్యానించడం మాత్రం ఖచ్చితంగా జరిగి ఉంటుంది.


Tags:    

Similar News