Big Breaking : భారీ అగ్ని ప్రమాదం ... 22 మంది సజీవ దహనం

గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించినట్లు అధికారికంగా తెలిసింది

Update: 2024-05-25 14:52 GMT

గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించినట్లు అధికారికంగా తెలిసింది. టీఆర్పీ గేమింగ్ జోన్ లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ జోన్ లో ఎంత మంది ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా? మరేదైనా కారణమా? అన్నది తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది మాత్రం మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల్లో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలు...
అగ్ని మాపక సిబ్బంది వచ్చేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు 22 మందికి పైగానే మృతి చెందినట్లు తెలిసింది. ఎవరెవరు మరణించారు? ఎంత మంది గేమింగ్ జోన్ లో ఉన్నారన్నది మాత్రం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు.రాజ్ కోట్ లో జరిగిన ఈ ప్రమాదం లో ఎంత మంది చిక్కుకున్నారన్నది దెలియరాలేదు. టీఆర్పీ గేమింగ్ జోన్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో తప్పించుకోలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 


Tags:    

Similar News