ఓయూ ప్రొఫెసర్ ఇంట్లో?

విరసం నేత ఖాసిం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి గజ్వేల్ చెందిన పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర [more]

Update: 2020-01-18 03:49 GMT

విరసం నేత ఖాసిం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి గజ్వేల్ చెందిన పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర విరసం కార్యదర్శిగా ప్రొఫెసర్ ఖాసిం ఎన్నికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకూ కచ్చితమైన సమాచారం మాత్రం పోలీసులు చెప్పట్లేదు. అయితే ఉదయం ఖాసిం ఇంటికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు . పోలీసులు ఇంట్లోకి ప్రవేశించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి మరి ప్రవేశించారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన సెల్ ఫోన్లు అన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .

Tags:    

Similar News