వైస్ అడ్మిరల్ ఎస్ హెచ్ శర్మ మృతి : రేపు అంత్యక్రియలు

1971లో జరిగిన ఇండో - పాక్ యుద్ధంలో పాల్గొన్న వీరుడు, రిటైర్డ్ వైస్ అడ్మిరల్ ఎస్ హెచ్ శర్మ(100) సోమవారం కన్నుమూశారు. ఒడిశా భువనేశ్వర్ లోని

Update: 2022-01-04 11:37 GMT

1971లో జరిగిన ఇండో - పాక్ యుద్ధంలో పాల్గొన్న వీరుడు, రిటైర్డ్ వైస్ అడ్మిరల్ ఎస్ హెచ్ శర్మ(100) సోమవారం కన్నుమూశారు. ఒడిశా భువనేశ్వర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6.20 గంటలకు కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎస్ హెచ్ శర్మ భౌతిక కాయాన్ని స్వగృహానికి తరలించిన కుటుంబ సభ్యులు.. ప్రజలు నివాళులు అర్పించేందుకు వీలుగా.. రేపటి వరకూ ఉంచనున్నారు. బుధవారం అంత్యక్రియలు జరపనున్నారు.

కాగా.. ఎస్ హెచ్ శర్మ 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో తూర్పు నౌకాదళానికి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఉన్నారు. అప్పుడు జరిగిన యుద్ధంలో భారతదేశం చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని పొందింది. ఈ యుద్ధం అనంతరం బంగ్లాదేశ్ అనే సరికొత్త దేశం ప్రపంచ పటంలో రూపుదిద్దుకుంది. వైస్ అడ్మిరల్ SH శర్మ తూర్పు నౌకాదళ కమాండ్ .. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా కూడా పనిచేశారని ఇండియన్ నేవల్ ఆర్మీ అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 1వ తేదీన ఆయన 100వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇదిలా ఉండగా.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎస్ హెచ్ శర్మ మృతిపట్ల ట్విట్టర్ లో సంతాపం ప్రకటించారు. ఒడిశా కు చెందిన ప్రముఖుల్లో ఒకరైన వైస్ అడ్మిరల్ SH శర్మ మరణం తనకు చాలా బాధకలిగించిందని ఆయన పేర్కొన్నారు.





Tags:    

Similar News