Summer Effect : వామ్మో.. మార్చి లోనే రోళ్లు పగిలే ఎండలా? ఇదేంటిరా సామీ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెల మొదటి వారంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట ఎండల తీవ్రతతో బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొనింది. ఉక్కపోత, సెగగాలుల తీవ్రత కూడా మొదలయింది. సూర్యుడి భగభగలతో రోడ్లు కూడా వేడెక్కుతున్నాయి. పగలు పది గంటలు దాటితే కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంటుంది. విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో అయితే పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ జనసంచారం కూడా కనిపించడం లేదు. మార్చి నెల రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లో భానుడి ప్రతాపం మామూలుగా లేదు. ఇప్పటికే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న కాలంలో అంటే మార్చి రెండో వారంలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా రాయలసీమలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువతున్నాయి. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు పల్నాడు ప్రాంతంతో పాటు కృష్ణా జిల్లాలోని నందిగామ, విజయవాడ ప్రాంతాల్లోనూ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఇలా ఉంటే ఇక రెండో వారం నుంచి ఎంండల తీవ్రత మరింత ఎక్కువవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఆరెంజ్ అలెర్ట్ జారీ...
తెలంగాణలోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంది. తెలంగాణలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ములుగు జిల్లా మంగంపేటలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధకిారులు తెలిపారు. ఈ ఏడాది ఇదే అత్యధిక ఉష్ణోగ్రతల అని అధికారులు పేర్కొన్నారు. ఆదిలాాద్ జిల్లాలో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తెలంగాణలోని పథ్నాలుగు జిల్లాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదదయ్యాయి. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొకవైపు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశముందని, వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వేడిగాలుల తీవ్రత కూడా మరింత ఎక్కువగా ఉంది.