Hyderabad : రేపటి నుంచి 36 గంటలు నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల్లో మాత్రమే

హైదరాబాద్ జలమండలి కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి కొన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదు

Update: 2026-03-06 12:40 GMT

హైదరాబాద్ జలమండలి కీలక ప్రకటన చేసింది. రానున్న రెండు రోజులు కొన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మంజీరీ ఫేజ్ - 3 తో పాటు పెద్దాపూర్ పంప్ హౌస్ లో చేపడుతున్న మరమ్మతు పనుల కారణంగా రానున్న రెండు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపేస్తామని జలమండలి అధికారులు ప్రకటించారు. దీనిపై ప్రజలు ముందు జాగ్రత్త పడాలని సూచించారు. గత మూడు దశాబ్దాల నుంచి ఉన్న పురాతన పైపులైన్ల కారణంగా లీకేజీలు వస్తున్నాయని, వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్ ప్యానుెల్ ను తొలగించి వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

మరమ్మతు పనులకు....
దీనివల్ల పంపింగ్ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని, అందువల్లనే ఈ పనులు చేపట్టామని జలమండలి అధికారులు చెప్పారు. ఈ మరమ్మతు పనులు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిదో తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకూ జరుగుాయి. అంటే 36 గంటల పాటు నీటి సరఫరా ఈ ప్రాంతాల్లో ఉండదని జలమండలి అధికారులు తెలిపారు. మణికొండ, కోకాపేట్, నార్సింగ్, మంచిరేవుల, షేక్ పరిధిలోని కాలనీలకు మంచినీటి సౌకర్యానికి అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. భోజగుట్ట ప్రాంతంలో మాత్రం తక్కువ ప్రెజర్ తో మాత్రమే నీటిని సరఫరా చేయనున్నారు. ప్రజలు ఈ అసౌకర్యాన్ని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా వివరాలకు జలమండలి కార్యాలయాన్ని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ముందుగానే మంచినీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News