Gold Prices Today : బంగారం కొనాలనుకుంటున్నారా? ఇదే రైట్ టైమ్ ఎందుకంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు క్రమంగా నేలచూపులు చూస్తున్నాయి.గత నాలుగు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లోనూ బంగారం, వెండి ధరలు దిగి రావడంతో కొంత వినియోగదారులకు వెసులుబాటు దొరికినట్లయింది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ఈ సమయంలో ధరలు తగ్గడం వల్ల తాము అనుకున్న మేరకు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని కొనుగోలు దారులు కూడా భావిస్తున్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలాగే సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేసేది వీటిని మాత్రమే.
విపరీతంగా పెరిగిన..
ఇటీవల కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. వెండి ధరలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. గత ఏడాది జనవరి నుంచి ప్రారంభమయిన ధరల పెరుగుదల నిన్న మొన్నటి వరకూ పెరుగుతూనే ఉన్నాయి. ధరలను అదుపు చేయడం ఎవరి వల్ల కాదు. బంగారం, వెండి ధరల్లో మార్పులకు అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయంగా జరిగే పరిణామాలతో పాటు యుద్ధాలు, ట్రంప్ నిర్ణయాలు, అమెరికా విధించిన అదనపు సుంకాలు, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు బంగారం,వెండి ధరల్లో మార్పులు, చేర్పులు కనిపిస్తాయి. అయితే గత నాలుగైదు రోజుల నుంచి ధరలు తగ్గుతుండటం ఒక రకంగా శుభసూచకమే.
స్వల్పంగా తగ్గి...
ఇక పెట్టుబడి పెట్టిన వారు ఒకింత నిరుత్సాహానికి గురవుతున్నారు. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండటంతో చాలా మంది అప్పులు చేసి మరీ వాటిపై పెట్టుబడులు పెట్టారు. కానీ నేడు ధరలు దిగి వస్తుండటంతో నష్టాలు వస్తాయని భావిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,49,290 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,62,870 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,94,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి.