జీ 20 అతిధులకు వెజ్ మీల్స్

జి20కి వచ్చే ప్రపంచ నేతలకు భారతదేశం కాయగూరలతో రుచికరమైన భోజనాలను పెడుతున్నారు. వీటిలో హైలైట్ ఏమంటే చిరుధాన్యాలతో మెనూను సిద్ధం చేశారు. అధికార ప్రతినిధులు, దేశాధిపతులకు వెజ్ భోజనాలే.

Update: 2023-09-08 16:17 GMT

జీ 20 అతిధులకు వెజ్ మీల్స్

చపాతి ఛాట్ నుంచి చిరుధాన్యాల వరకు

జి20కి వచ్చే ప్రపంచ నేతలకు భారతదేశం కాయగూరలతో రుచికరమైన భోజనాలను పెడుతున్నారు. వీటిలో హైలైట్ ఏమంటే చిరుధాన్యాలతో మెనూను సిద్ధం చేశారు. అధికార ప్రతినిధులు, దేశాధిపతులకు వెజ్ భోజనాలే. గుడ్డు, మాంసం ఉండనే ఉండవు. జీ20 శిఖరాగ్రసభ ముగిసే వరకు సంప్రదాయక వంటలే ఉంటాయి.

అధినేతల భార్యలకు జైపూర్ హౌస్ లో పూర్వకాలపు వెజ్ డిష్ లను సర్వ్ చేస్తారు. చిరుధాన్యలతో చేసిన వంటకాలు వారి మనస్సులను దోచుకుంటాయని భావిస్తున్నారు. సమావేశాలలో అనేక దేశాల ప్రతినిధుల ధర్మపత్నుల కోసం కొన్ని ఈవెంట్లను కూడా ప్లాన్ చేశారు. వాటిలో దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడి పాకశాస్త్రానికి సంబంధించినవి ఉంటాయి. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమాలన్నీ జరుపుతారు. దేశ, విదేశాలకు సంబంధించిన అన్ని హై ప్రొఫైల్ ఈవెంట్లు ఇక్కడే నిర్వహిస్తారు. అతిధులకు సంబంధించిన భద్రతపై ప్రత్యేక ద్రుష్టి సారించారు. రుచికరమైన భారతీయ వంటకాలను వీరికి అందించడం మరో ఎత్తు. థాలీ(భోజనం)లో చిరుధాన్యాలతో చేసిన పులావ్, ఇడ్లి వడ్డించనున్నారు. అలాగే రాజస్థాన్ లో పేరుపొందిన దల్ బాటి చుర్మా, బెంగాలీ రసగుల్లా, దక్షిణ భారతీయ వంటకం మసాల దోశ, బీహార్ వంటకం లిట్టి చోఖ లను కూడా సమితి ప్రతినిధులకు అందచేస్తారు.

ప్రత్యేక వీధి వంటకాలైన పానీపూరీ, చట్పాటి చాట్, దహీ భల్లా, సమోసాలు కూడా వారికి రుచి చూపిస్తారు.

Tags:    

Similar News