Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ వారం మొత్తం తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. కంపార్ట్ మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు బయట వరకూ విస్తరించి ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ లలో ఉన్నభక్తులకు అవసరమైన మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదం, చిన్నారులకు పాలను శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు.
క్యూ లైన్లలో ఓపిగ్గా...
దర్శన క్యూలైన్ లో ఎక్కువ సమయం వేచి ఉండటంతో కొందరు చేస్తున్నారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సీరియస్ అయ్యారు. అయితే క్యూ లైన్ లో తాను నినాదాలు చేయడం తప్పేనని, టీటీడీని, శ్రీవారి భక్తులను క్షమాపణలు భక్తుడు కోరినట్లు అదికారులు తెలిపారు. శ్రీవారి దర్శన క్యూలైన్ లో నిన్న రాత్రి రాజమహేంద్రవరానికి చెందిన అనుపోజు వీర నవీన్ అనే భక్తుడు నారాయణగిరి షెడ్లలో తోటి భక్తులను ప్రేరేపించి నినాదాలు చేశాడు.ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో సదరు భక్తుడిని పిలిపించి మాట్లాడగా దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం ముమ్మాటికీ తన తప్పేనని ఒప్పుకున్నాడు.ఇందుకుగాను టీటీడీ మరియు శ్రీవారి భక్తులకు ఆ భక్తుడు క్షమాపణలు తెలియజేశాడు. కాగా భక్తులందరూ శ్రీవారి దర్శనంలో తమ వంతు వచ్చే వరకు సంయమనంతో ఓపిగ్గా వేచి ఉంటూ సిబ్బందికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్ వరకూ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు భక్తుల క్యూ లైన్ ఉంది. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,264 మంది భక్తులు దర్శించుకున్నారు.వీరిలో 29,410 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.28 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.