నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తొలి జీతమే ఎనభై ఐదు వేలు.. 2,551 పోస్టులకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలయింది. కేంద్రం ఆధ్వర్యంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వంటి పలు జాతీయ వైద్య సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో దేశవ్యాప్తంగా 2551 ఖాళీలు ఉన్నాయి. మొదటి నెల నుంచే 85 వేల రూపాయలకు పైగా జీతాన్ని పొందవచ్చు. నర్సింగ్ పోస్టులలో 80 శాతం మహిళలతో, 20 శాతం పురుషులను తీసుకుంటారు. ఈ పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి. ఈ రెండింటిలో విజయం సాధించిన వారికి సర్టిఫికెట్లు పరిశీలించి, అభ్యర్థుల ప్రాధాన్యం ప్రకారం పోస్టులు ఇస్తారు.
అర్హత: బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎంతో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు : 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం పది నుంచి పదిహేనేళ్లు సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తులు : మార్చి 16 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రూ.2400. దివ్యాంగులకు ఉండదు.
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: స్టేజ్-1: 11.04.2026, స్టేజ్-2: 30.04.2026