YSRCP : వైసీపీ విజయంలో నిజమెంత? భవిష్యత్ లో తేలనుందా?

వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వం సక్సెస్ కాలేదు

Update: 2026-03-14 07:00 GMT

వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వం సక్సెస్ కాలేదు. కానీ.. జగన్ సక్సెస్ అయ్యారని ఫ్యాన్ పార్టీ తెగ ప్రచారం చేసుకుంటుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో నడపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ వాటికి టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడాన్ని తమ విజయంగానే వైసీపీ చూపుతుంది. పీపీపీ విధానంలోనే వైద్య కళాశాలలను కొనసాగిస్తామని, అలాగే పేదలకువైద్యం విషయంలో అన్యాయం జరగకుండా అన్నిచర్యలు తీసుకుంటామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్పినా టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

పీపీపీ పద్ధతిలోనే...
ప్రభుత్వ వైద్య కళాశాలలు,పీపీపీ విధానంపై నిర్వహించాలని, రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో పీపీపీ విధానంలో పది వైద్య కళాశాలలను నడిపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సత్యకుమార్ శాసనసభ సాక్షిగా తెలిపారు. పదిహేడు కాలేజీల్లో పదకొండు నాబార్డు కింద, మూడు కేంద్రం, మూడు సాస్కి కింద మంజూరయ్యాయని చెప్పారు. దీనికి మొత్తం వ్యయం 8480 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 1, 500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని సత్యకుమార్ తెలిపారు. అందులో పులివెందుల కాలేజీకి మాత్రమే దాదాపు రూ 500 కోట్లు ఖర్చుపెట్టి మిగిలిన కాలేజీల విషయంలో జగన్ వివక్ష ప్రదర్శించారని మంత్రి సత్యకుమార్ చెప్పారు.
టెండర్లు వేస్తే...
వైద్య కళాశాలలను ప్రయివేటీకరణ చేస్తే తాము న్యాయపరంగా పోరాటం చేస్తామని, ఒకవేళ ఎవరైనా టెండర్లు వేసి ముందుకు వస్తే తాము అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని జగన్ హెచ్చరించారు. జగన్ హెచ్చరికల వల్లనే ఎవరూ టెండర్లలో పాల్గొనలేదనివైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం జగన్ ఇక అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఎవరూ భయపడకుండా ముందుకు రావాలని కోరినా, టెండర్ల గడువు పెంచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో వైసీపీ దానిని తనకు అడ్వాంటేజీగా మార్చుకుంటుంది. మరి ఇప్పటికైనా వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే ప్రజల్లో పలుచన అవుతామని కూటమి నేతలు అంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News