వారసుడవుతాడనుకుంటే... నరకాసురుడయ్యాడే?

వనమా వెంకటేశ్వరరావు దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఏనాడు ఆయన వివాదాల్లో చిక్కుకోలేదు.

Update: 2022-01-06 06:33 GMT

వనమా వెంకటేశ్వరరావు మృదుస్వభావి. ఆయన మెతకతనంతోనే రాజకీయాలు ఇంతవరకూ నెరిపారు. పదేళ్ల పాటు గెలవలేకపోయినా ఆయన చెక్కు చెదరలేదు. తన మంచితనమే ఎప్పటికైనా తనను గెలిపిస్తుందని నమ్ముకున్నారు. కానీ పుత్రరత్నం ఎక్కి వచ్చిన వేళ ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై ఆరోపణలు లెక్కకు మించి వినపడుతున్నాయి.

మూడు దశాబ్దాలుగా....
వనమా వెంకటేశ్వరరావు దాదాపు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఏనాడు ఆయన వివాదాల్లో చిక్కుకోలేదు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేసినా ఏనాడు ఆరోపణలను ఎదుర్కొనలేదు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినా గ్రూపులు మెయిన్ టెయిన్ చేయలేదు. 2009, 2014లో వరసగా ఓటమి పాలయినా ఆయనలో ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు.
టీఆర్ఎస్ లోకి వెళ్లి....
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. వనమా కుమారుడు రాఘవ పంచాయతీలు చేయడంలో దిట్ట. పంచాయతీలు చేయడం కమీషన్లు పొందడం, నగదు లేదా ఆస్తుల రూపంలో రాయించుకోవడం రాఘవకు అలవాటుగా చెబుతారు. ఆయనపై గత కొన్ని నెలల్లోనే రెండు కేసులు నమోదయ్యాయి.
రాఘవపై ఆరోపణలు...
ీతాజాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలోనూ రాఘవను దోషిగా చూపుతున్నారు. రాఘవ చేసే సెటిల్ మెంట్లతో నియోజకవర్గంలో ఎందరో నష్టపోయారంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడి, రాఘవను ఎదుర్కొనలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పుడు కొడుకు వ్యవహారం వనమా వెంకటేశ్వరరావు మెడకు చుట్టుకుంది. విపక్షాలు వనమాను రాజీనామా చేయాలని డిమండ్ చేస్తున్నాయి. టీఆర్ఎస్ అధిష్టానం సయితం వనమా రాఘవపై గుర్రుగా ఉంది. వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. వనమా కూడా కొడుకు నిర్వాకం పట్ల నోరు మెదపలేని పరిస్థిితి.


Tags:    

Similar News