కొత్త రేషన్ కార్డు కావాలా? అయితే నిబంధనలివే
గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే, లబ్ధిదారుల గుర్తింపు కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే, లబ్ధిదారుల గుర్తింపు కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త రేషన్ కార్డ్ నిబంధనలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులన్నీ శాతం డిజిటలైజ్ చేశారు. వీటిలో 99 శాతం పైగా కార్డులు ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడూ తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఇలా చేయని పక్షంలో, ఆ సభ్యుని పేరును కార్డు నుండి తొలగించే అవకాశం ఉంది.
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ :
వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేలా ఈ సదుపాయాన్ని మరింత బలోపేతం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు పైగా పోర్టబిలిటీ లావాదేవీలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాత కార్డుల స్థానంలో ఉచితంగా కొత్త 'స్మార్ట్ రేషన్ కార్డుల'ను పంపిణీ చేసే ప్రక్రియ కూడా వేగవంతమైంది.ఈ కేవైసీ ప్రక్రియలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం వెరిఫికేషన్ కేంద్రాలను పెంచింది. లబ్దిదారులు క్రింది పద్ధతుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని కొత్తగా విడుదల చేసిన నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
1. రేషన్ షాపుల వద్ద :
మీ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి, అక్కడ ఉన్న ఈ-పోస్ (e-PoS) మిషన్ ద్వారా వేలిముద్రలు వేసి e-KYC పూర్తి చేయవచ్చు. ఇది అత్యంత సులభమైన పద్ధతి.
2. ఆన్‌లైన్ ద్వారా:
మీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్ ద్వారా కూడా చేయవచ్చు:
వెబ్‌సైట్‌లో 'e-KYC for Ration Card' ఆప్షన్ ఎంచుకోండి.
రేషన్ కార్డ్ నంబర్ మరియు ఆధార్ నంబర్ నమోదు చేయండి.
ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి సబ్ మిట్ చేయండి.
3. మీ -సేవ / సచివాలయాల వద్ద:
గ్రామ/వార్డు సచివాలయాల్లో నూ మీ-సేవ కేంద్రాల్లో కూడా డాక్యుమెంట్లు సమర్పించి ఈ కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఎవరికి మినహాయింపు??
చిన్న పిల్లలు (ఐదేళ్ల లోపు వారు), బయోమెట్రిక్ సరిగ్గా పడని వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యామ్నాయ వెరిఫికేషన్ మార్గాలు అందుబాటులో ఉంటాయి. మీ రేషన్ కార్డులో సభ్యుల పేర్లు తొలగించకుండా ఉండాలంటే, ప్రభుత్వం విధించిన గడువులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవడం ఉత్తమం.