Gold Prices Today : బంగారం దిగివస్తుంది.. వెండి శాంతిస్తుంది
ఈ రోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు కొంత దిగి వస్తున్నాయి. వెండి ధరలు కూడా శాంతిస్తున్నాయి. అయితే ఎంతగా ధరలు దిగివస్తాయన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో ధరలు మళ్లీ పెరిగే అవకాశాలుంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, అమెరికా, భారత్ ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతుంది. బంగారం, వెండి ధరలపై పెట్టుబడి పెట్టిన వారు మాత్రం తాము ఇప్పుడే వెనక్కు తీసుకోవాలా? మరికొంత కాలం వెయిట్ చేయాలా? అన్న మీమాంసలో ఉన్నారు.
పెట్టుబడి పెట్టిన వారు...
ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ఎక్కువ మంది పెట్టుబడి పెట్టారు. బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లను కూడా కాన్సిల్ చేసి మరీ గోల్డ్, సిల్వర్ పై మదుపు చేశారు. బ్యాంకు వడ్డీతో పోల్చుకుంటే రోజుల్లోనే తమ డబ్బుకు పదింతలు డబ్బులు వస్తాయని అత్యాశతో అనేక మంది పెట్టుబడి పెట్టారు. దీంతో పాటు అనేక మంది తమ వద్ద ఉన్న వస్తువులను కూడా అమ్మకానికి పెట్టారు. దీంతో డిమాండ్ లేక పోవడంతో పాటు ఎక్కువ బంగారం అందుబాటులో ఉండటంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయన్నది మార్కెట్ నిపుణుల అంచనాగా వినపడుతుంది. అయితే మళ్లీ ధరలు పెరిగే అవకాశముంందని అంటున్నారు.
రానున్న కాలంలో...
మరొకవైపు రానున్న కాలంలో ధరలు మరింత పెరుగుతాయని, అందుకే మదుపు చేసిన వారు అలాగే ఉంచితే భారీ నష్టం కాకుండా స్వల్ప నష్టాలతోనయినా బయట పడవచ్చని కొందరు సూచిస్తున్నారు. ఈ రోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,41,540 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,54,410 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. కిలో వెండి ధర 2,99,900 రూపాయలుగా నమోదయింది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.