T20 World Cup : వరల్డ్ కప్ లో భారతీయ మూలాలున్న క్రికెటర్లు ఎంతమందో తెలుసా?

టీ20 వరల్డ్ కప్ లో భారతీయ సంతతికి చెందిన అనేక మంది ఆటగాళ్లు వివిధ జట్లలో ఉన్నారు

Update: 2026-02-06 02:38 GMT

భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మరొక గేమ్ కు లేదు. డబ్బుకు డబ్బుకు.. పేరు పేరు రెండు పుష్కలంగా సమకూరేది క్రికెట్ లోనే. అందుకే క్రికెట్ కు ఉన్న ఆదరణ భారతీయ యువతలో పెద్దగా లేదు. టీం ఇండియాలో చోటు దక్కించుకోవడం అంత సులువు కాదు. ఉన్నవాళ్లని పక్కన పెట్టి తీసుకోవాలంటే అద్భుతమైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అండర్ 19 నుంచి ప్రయత్నించినా అనేక మంది విఫలమవుతుంటారు. కానీ వరల్డ్ కప్ లో మాత్రం తమ పూర్వీకులు ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడటం, క్రికెట్ మీద పిచ్చి అభిమానంతో ఉన్న అనేక మంది అక్కడే ఆట నేర్చుకుని, ఆ దేశం తరుపున ఆడేందుకు ఇప్పుడు తరలి వస్తున్నారు. వారి మూలాలు భారత్ వే. అయినా వారు స్థిరపడింది వేరే చోట.

టీ20 వరల్డ్ కప్ లో...
ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ను ఒకసారి పరిశీలిస్తే అనేక మంది వివిధ జట్టుల్లో భారతీయ సంతతికి చెందిన నలభై మంది వరకూ ఆటగాళ్లు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదా? దాదాపు ఇరవై జట్లలో నలభై మంది భారతీయ సంతతికి చెందిన ఆటగాళ్లున్నారు. అంటే యావరేజ్ న ఒక్కొక్క జట్టులో ఇద్దరు కనీసం భారతీయ సంతతి ఆటగాల్లు ఆడుతున్నారు. వీరంతా టీం ఇండియాలో చోటు సంపాదించలేక ఇతర దేశాలకు వెళ్లి తమ క్రికెట్ కెరీర్ ను మలచుకునే ప్రయత్నం చేస్తన్నారు. జస్ప్రీత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, మోనాక్ పటలే వంటి వారు వివిధ జట్లలో ఉన్నారు. మన దేశానికి చెందిన ఆటగాళ్లు మరొక దేశానికి చెందిన జెర్సీలను ధరించి ఆడుతుండటం విశేషం.
కెనడాది అగ్రస్థానం....
ఇక ఈ వరల్డ్ కప్ లో అత్యధికంగా భారతీయ సంతతి ఆటగాళ్లున్న జట్టు కెనడా. ఈ జట్టులో మొత్తం పదకొండు మంది భారతీయ సంతతి ఆటగాళ్లున్నారు. తర్వాత స్థానం అమెరికాది. అమెరికాలో తొమ్మిది మంది భారతీయ సంతతి ఆటగాళ్లున్నారు. ఒక యూఏఈలోనూ, ఒమన్ లోనూ ఏడుగురు భారతీయ సంతతి ఆటగాళ్లున్నారు. దక్షిణాఫ్రికాలో ఒకరు, న్యూజిలాండ్ లో ఒకరు ఉన్నారు. ఇలా అనేక దేశాలలో భారతీయ సంతతి కలిగిన ఆటగాళ్లు ఆ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆ జట్ల గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఇండియాలో సరైన అవకాశాలు లేక పోవడంతోనూ, విదేశాల్లో స్థిరపడిన భారతీయ కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. మూలాలు భారతదేశానివి అయినా.. వారు అక్కడే స్థిరపడటంతో అక్కడి వారిగానే ఆ దేశాలు చూస్తున్నాయి.
Tags:    

Similar News