బ్రేకింగ్ : మాచర్ల మున్సిపాలిటీ వైసీపీదే.. ఛైర్మన్ దాడి చేసిన వ్యక్తే?

మాచర్ల మున్సిపాలిటీనీ వైసీపీ కైవసం చేసుకుంది. మాచర్లలోని 26 వార్డులను గెలుచుకున్న వైసీపీ మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 31 వార్డుల్లో ఇప్పటికే 26 వార్డులు [more]

Update: 2020-03-14 06:07 GMT

మాచర్ల మున్సిపాలిటీనీ వైసీపీ కైవసం చేసుకుంది. మాచర్లలోని 26 వార్డులను గెలుచుకున్న వైసీపీ మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 31 వార్డుల్లో ఇప్పటికే 26 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్నలపై దాడి చేసిన తురకా కిషోర్ సయితం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ గా తురకా కిషోర్ పేరు విన్పిస్తుంది. ప్రస్తుతం తురకా కిషోర్ దాడి కేసులో జైలులో ఉన్నారు. తురకా కిషోర్ ఏకగ్రీవం కావడంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన పేరును ఛైర్మన్ రేసులో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News