ఆగి ఉన్న లారీని ఢీ.. ముగ్గురి మృతి

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆగి ఉన్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చింతపల్లి హైవే [more]

Update: 2021-08-24 04:00 GMT

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆగి ఉన్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చింతపల్లి హైవే వద్ద ఆగి ఉన్న లారీని ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు చనిపోగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చనిపోయిన వారు ఆంధ్ర ప్రదేశ్ చెందిన నాగేశ్వరరావు (44) జయరావ్‌ (42) మల్లికార్జున్‌ (40) లుగా అధికారులు గుర్తించారు.. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News