India vs South Africa : సిరీస్ ను దక్కించుకోవాలని భారత్.. సమం చేయాలని దక్షిణాఫ్రికా

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ రేపు లక్నోలో జరగనుంది

Update: 2025-12-16 04:18 GMT

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ రేపు లక్నోలో జరగనుంది. ఈ మ్యాచ్ సిరీస్ ను డిసైడ్ చేస్తుంది. ఇప్పటికే భారత్ సిరీస్ పై 2-1 ఆధిక్యతలో ఉంది. ఐదో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది. ఐదో మ్యాచ్ కు ముందే సిరీస్ ను సొంతం చేసుకోవాలంటే రేపు జరిగే లక్నో మ్యాచ్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మరొకసారి భారత్ - దక్షిణాఫ్రికా సమంగా నిలుస్తాయి. అప్పుడు అహ్మదాబాద్ టెస్ట్ పై వత్తిడి మరింత పెరుగుతుంది. ఇప్పటికీ భారత్ జట్టు ఆందోళనకరంగానే ఉందని చెప్పాలి.

ఓపెనర్లతో పాటు కెప్టెన్ కూడా...
ఓపెనర్లలో అభిషేక్ శర్మ ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో పరవాలేదనిపించినా శుభమన్ గిల్, సూర్య కుమార్ యాదవ్ లు తమ ప్రతాపాన్ని చూపలేకపోయారు. అంటే వీరిద్దరూ ఫామ్ లో లేకపోవడం భారత జట్టుకు ఒకింత ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే ముగ్గురు ఎంత లేదన్నా మినిమం స్కోరు చేస్తే భారీ పరుగులు సాధించడానికి భారత్ జట్టుకు వీలవుతుంది. ముందుగా ఫీల్డింగ్ చేసినా, తర్వాత చేసినా వత్తిడి అనేది బ్యాటర్లు, బౌలర్లపై ఉండదు. అందుకే ఈ ముగ్గురు మరింత రాణించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
ఇద్దరూ దూరం కావడంతో....
ఇక ఇప్పటికే పేసర్ జస్ప్రిత్ బుమ్రా జట్టు నుంచి దూరమయ్యారు. చివరి రెండు మ్యాచ్ లలో ఆడటం అనుమానమే. ఇక మరొక ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యారన్న వార్తలు ఫ్యాన్స్ ను కలవరపరుస్తున్నాయి. ధర్మశాలలో అక్షర్ పటేల్ కు విశ్రాంతినిచ్చారని చెబుతున్నా అనారోగ్యంతో మిగిలిన రెండు మ్యాచ్ లు ఆడరన్న ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే భారత్ జట్టు మరింతగా బలహీనంగా మారనుంది. అందుకే జట్టులో ఉన్న వారు ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. దూకుడుతో ఆడుతూనే వికెట్లు కాపాడుకోవడం బ్యాటర్లు, అలాగే ధర్మశాలలో మాదిరిగా వెంటవెంటనే వికెట్లు తీయగలిగితే భారత్ కు విజయావకాశాలుంటాయి. లేకపోతే శ్రమించాల్సి ఉంటుంది.


Tags:    

Similar News