Gold Price Today : రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు ...వెండి తగ్గడం లేదుగా

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

Update: 2025-12-16 03:41 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు ప్రతి రోజూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు చేరువలో ఉంది. కిలో వెండి ధర రెండు లక్షల రూపాయల ధర పలుకుతుంది. ఈ రేంజ్ లో ధరలు పెరుగుతుండటంతో బంగారం, వెండి వైపు చూడాలంటేనే వినియోగదారులు, కొనుగోలు దారులు భయపడిపోతున్నారు. గతంలో కొత్త ఏడాదికి ముందు బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయడం రివాజుగా వస్తుంది. అయితే ఈసారి కొత్త ఏడాదిలో బంగారం కొనుగోళ్లు అంతగా ఉండే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతుంది.

ఎన్ని ఆఫర్లు ప్రకటించినా...
జ్యుయలరీ దుకాణాల యాజమాన్యాలు ఎన్ని ఆఫర్లు ప్రకటించినా ధరలను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. తరుగు, జీఎస్టీ, స్టేట్ ట్యాక్స్ అంటూ అదనంగా వసూలు చేస్తుండటంతో బంగారం ధర మరింత బరువుగా మారింది. నిజానికి మధ్య, వేతనజీవులకు బంగారం భారంగా మారిందనే చెప్పాలి. ఇలాంటి సమయంలో ఎక్కడ నగలు కొనుగోలు చేయాలన్నా, ఆదా అవుతుందని ఊదరగొట్టినా ధరలు దిగి రాకపోవడంతో అటు వైపు చూసేందుకు కూడా మహిళలు ఇష్టపడటం లేదు. అంతర్జాతీయంగా ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ మరింత బలపడటం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
నేటి ధరలు...
మరొకవైపు పెట్టుబడి పెట్టే వారు సయితం ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. కొత్త ఏడాది కూడా బంగారం కొనుగోళ్లు కూడా పెద్దగా ఉండే అవకాశం లేదన్న అంచనాలు వినపడుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వేల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,33,900 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,37,000 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,99,500 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండవచ్చు.
Tags:    

Similar News