మాస్క్ ధరించని తీగల… వెయ్యి రూపాయల జరిమానా

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. మాస్క్ లేకుండా కారులో ప్రయాణిస్తున్న తీగల కృష్ణారెడ్డి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. తీగల కృష్ణారెడ్డి తన [more]

Update: 2021-05-12 00:59 GMT

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. మాస్క్ లేకుండా కారులో ప్రయాణిస్తున్న తీగల కృష్ణారెడ్డి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. తీగల కృష్ణారెడ్డి తన కారులో కర్మన్ ఘాట్ వైపు వెళుతున్నారు. అక్కడ బందోబస్తు ను నిర్వహిస్తున్న పోలీసులు తీగల కృష్ణారెడ్డి కారును ఆపి తనిఖీ చేయగా, ఆయన మాస్క్ ధరించలేదు. మాస్క్ ధరించకుంటే జరిమానా విధిస్తామని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు, తీగల కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే చివరకు తీగల కృష్ణారెడ్డి జరిమానా చెల్లించి వెళ్లారు.

Tags:    

Similar News