అప్పుడే సర్వేలు.. పవన్ పై మైండ్ గేమ్

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పుడే జగన్ వ్యతిరేక మీడియా సర్వేలు ప్రారంభించింది.

Update: 2022-06-09 07:03 GMT

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పుడే జగన్ వ్యతిరేక మీడియా సర్వేలు ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీదే గెలుపని చాటుతుంది. ఇప్పటికిప్పుడు ప్రజలు ఒక నిర్ణయానికి రాలేరు. అధికార పార్టీకి ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ రెండేళ్ల సమయంలో జనాలను తన వైపునకు మార్చుకునే వీలుంది. లేదు అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగే అవకాశముంది. ఈ రెండింటిలో వేటినీ కొట్టి పారేయాలేం. కానీ ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే సర్వేను ప్రారంభమయ్యాయి. పొత్తులపైనే ఈ సర్వే నిర్వహించినట్లు ఏబీఎన్ యాజమాన్యం చెప్పుకుంది.

ఒంటరిగా పోటీ చేయాలట....
ఏబీఎన్ నిర్వహించిన సర్వేలో 1.30 వేల మంది పాల్గొన్నారు. వీరిలో జగన్ సర్కార్ పై పూర్తి అసంతృప్తితో ఉన్నారని ఏబీఎన్ తెలిపింది. ఇక పొత్తులపై కూడా ఏబీఎన్ ఒక మాట చెప్పింది. టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలని 45.7 శాతం మంది కోరుకున్నారని, టడీపీ, జనసేన కలసి పోటీ చేయాలనే వారు కేవలం 18 శాతం మంది మాత్రమే ఉన్నారని పేర్కొంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేయాలనుకునే వారు 19క.2 శాతం మంది ఉన్నారని తెలిపింది. జనసేన, బీజేపీ కలసి పోటీ చేయాలని 17.1 శాతం మంది కోరుకున్నారట.
పవన్ కు చెక్ పెట్టడానికేనా?
జనసేన పార్టీ ముఖ్యమంత్రి పదవి పవన్ కల్యాణ్ కు ఇవ్వాలని డిమాండ్ చేసే సందర్భంలో ఈ సర్వే ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. మైండ్ గేమ్ లో భాగంగా టీడీపీయే అధికారంలోకి వస్తుందని, జనసేన, టీడీపీ పొత్తు ఎవరూ కోరుకోవడం లేదన్న సంకేతాలను జనసైనికులకు పంపాలన్న ప్రయత్నంలో భాగంగానే జరిగినట్లు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా బలహీనమయింది. చంద్రబాబు వల్లనే ఆ పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండవచ్చు. కానీ పొత్తులపై ప్రజల్లో అందరికీ ఒక అవగాహన ఉంది.
మైండ్ గేమ్ లో భాగంగానే..?
చంద్రబాబు ఒంటరిగా పోట ీచేసి ఎప్పుడూ గెలవలేదు. పొత్తులతోనే ఆయన అధికారంలోకి రాగలిగారు. ఈ సంగతి ఆయనతో పాటు ప్రతి ఒక్కరికి తెలుసు. పొత్తులతోనే చంద్రబాబు బరిలోకి దిగాలని, అప్పుడే విజయమని చాలామంది కోరుకుంటున్నారంటే పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ అత్యధికశాతం మంది ఒంటరిగా టీడీపీ పోటీ చేయాలని కోరుకోవడం జనసేన కు కొంత ఝలక్ ఇచ్చేందుకే ఈ సర్వే నిర్వహించినట్లు పక్కాగా కనపడుతుంది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పక్కా తెలుగుదేశం పార్టీ పత్రిక, ఛానెళ్లు. వాటి సర్వేలకు నిబద్ధత లేదు. నిజాయితీ కూడా లేదు. జగన్ ను మొండిగా వ్యతిరేకించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఒక సంస్థ చేసిన సర్వే ను ప్రజలు ఎంత మేరకు నమ్ముతారన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News