ఓయూ దగ్గర ఉద్రిక్తత… తేజస్వి సూర్యను?

ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీకి వెళ్లిన బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యను గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. తేజస్వి సూర్య పర్యటనకు [more]

Update: 2020-11-24 07:02 GMT

ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీకి వెళ్లిన బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్యను గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. తేజస్వి సూర్య పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. తేజస్వి సూర్య గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ప్రచారంలో పాల్గొంటూనే ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనను పెట్టుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా వారిని తోసుకుని తేజస్వి సూర్య, బీజేవైఎం కార్యకర్తలు లోపలికి వెళ్లారు. దీంతో పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

Tags:    

Similar News