సీఎం రమేష్ కు ఊహించని షాక్

Update: 2018-06-15 08:00 GMT

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగిన తెలుగుదేశం పార్టీ నేత సీఎం రమేష్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయన శుక్రవారం కడపలో ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలను ఆ పార్టీ ఆహ్వానించింది. అయితే, సీఎం రమేశ్ దీక్షకు మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేతలు, ఇద్దరుముగ్గురు ప్రజాసంఘాల నేతలు మాత్రమే హజరయ్యరు. దీంతో ఆ పార్టీ నేతలకు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. మిగిలిన తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి డుమ్మాకొట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Similar News