సన్నీ లియోన్ పై హార్ధిక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2018-06-11 11:24 GMT

బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కు ఊహించని వ్యక్తి నుంచి అండ లభించింది. గుజరాత్ లో పటేళ్ల ఉద్యమం లేవనెత్తి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హార్ధిక్ పటేల్... సన్నీ లియోన్ కి మద్దతుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సన్నీ లియోన్ గతాన్ని బట్టి ఇంకా పోర్న్ స్టార్ గా ఎందుకు చూడాలని, ఆమె ఇప్పుడు ఒక నటి అని అన్నారు. ఆమెను కూడా నర్గీస్, శ్రీదేవి, మాధురీ దీక్షిత్ లానే చూడాలని పేర్కొన్నారు. అలా చూడకపోతే ఈ దేశం ఎప్పటికీ మారదన్నారు. ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో హీరోయిన్లపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా సన్నీకి మద్దతుగా పటేల్ వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది. ఓటర్లలో అవగాహన తెచ్చేందుకు హార్ధిక్ వచ్చే నెలలో మధ్యాప్రదేశ్ వ్యాప్తంగా యాత్ర నిర్వహించనున్నారు.

Similar News