కాంగ్రెస్, బీజేపీలకు గట్టి షాక్

Update: 2018-07-21 12:12 GMT

పశ్చిమ బెంగాల్ బలపడాలని భావిస్తోన్న భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన చందన్ మిత్రా బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ సీనియర్ నేత ఎల.కె.అద్వానీకి సన్నిహితుడిగా పేరున్న మిత్రాకు మోదీ-షా ధ్వయం ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఆయన రాజీనామా చేశారు. శనివారం కోల్ కత్తా లో నిర్వహించిన తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీలో ఆయన పార్టీలో చేరారు. ఎంపీ కంటే ముందు ఆయన పాత్రికేయుడిగా కూడా ఉన్నారు. ది స్టేట్స్ మెన్ తో జర్నలిస్టుగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన పయోనీర్ పత్రికకు ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఇక ఇదే ర్యాలీలో కాంగ్రెస్ పార్టీకి కూడా షాక్ ఇచ్చారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమర్ ముఖర్జీ, అబూ తహర్, సబీనా యస్మీన్, అక్రుజ్మన్ లు తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు.

Similar News