చంద్రబాబుకు పీకే టీమ్ అక్కర్లేదా? ఏపీలో రాజకీయాల్లో కీలక పరిణామాలు!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో హడావుడి ఎక్కువైపోయింది. ఎన్నికల్లో ..

Update: 2023-08-28 04:04 GMT

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో హడావుడి ఎక్కువైపోయింది. ఎన్నికల్లో గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. రోజురోజుకు రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో నువ్వా.. నేనా అన్నట్లు సాగుతోంది. ఏపీలో ఎన్నిక ఏదైనా గెలుపు వైఎస్సార్సీపీదే అంటూ నేతలు బలంగా నమ్ముకుంటున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించగా, వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదేనంటూ భావిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం వెనుక ఎవరి వ్యూహం ఉందో అందరికి తెలిసిందే. అదే ప్రశాంత్ కిషోర్ టీమ్ వైసీపీ నేతలకు కొన్నేళ్లుగా వెనకుండి విజయాలు అందిస్తోంది.

అయితే పీకే టీం వ్యూహాలతోనే వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ లభించిందని చెప్పుకొంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు వ్యహాలతో ముందుకు వెళ్తూ ప్రభుత్వానికి బలంగా మారింది పీకే టీం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం అనేది ప్రశాంత్ కిషోర్ ఆలోచనగానే అని చెబుతున్నారు.

జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలే కలిసి వచ్చాయా..?

అంతేకాకుండా జగన్‌ సర్కార్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, ఆ పథకాలన్ని కూడా గడపగడపకు చేరేలా ఎమ్మెల్యేలంతా కృషి చేయడం కూడా అందుకు కారణమని, అందుకే వైసీపీకి ప్రజల మద్దతు పెరిగిపోయిందని నేతలు చెబుతున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలతో నియోజకవర్గాల్లో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయడం, స్థానిక నేతలపై ఎప్పటికప్పుడు నివేదికలను ప్రభుత్వానికి అందించడంలో పీకే టీమ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే పీకేటీమ్‌ రెండు మూడు నెలలకోసారి పీకే టీం ఇచ్చే నివేదికలను సీఎం జగన్ స్వయంగా నేతల ముందు ఉంచుతున్నారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వంపై, ఎమ్మెల్యేలపై జనాల అభిప్రాయం ఎలా ఉందనే విషయాన్ని సీఎం జగన్‌ తెలుసుకుంటున్నారు.

అయితే వైఎస్సార్‌సీపీకి కీలక పాత్ర పోషిస్తున్న ప్రశాంత్‌ కిశోర్‌ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి కూడా ఫేవర్‌ చేస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. చంద్రబాబు కూడా ప్రశాంత్ కిషోర్ కలిసినట్లు టీడీపీ వర్గాల ద్వారా సమాచారం. అయితే, ఈ విషయంలో మళ్లీ చంద్రబాబు వెనక్కి తగ్గారని కూడా వార్తలు వస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు పీకే టీమ్‌తో దూరంగా ఉంటున్నారా?

కాగా, వైసీపీ పీకే టీమ్‌ వెనుక ఉండి నడిపిస్తున్నట్లుగానే టీడీపీ కూడా రెండేళ్ల కిందట ఓ స్టాటజీ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. గతంలో ప్రశాంత్ కిశోర్ టీంలో పనిచేసిన సీనియర్ స్ట్రాటజిస్ట్ రాబిన్ సింగ్ టీడీపీకి ప్రస్తుతం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబిన్ సింగ్ టీం ఇచ్చే నివేదిక ఆధారంగా టీడీపీ ఎప్పటికప్పుడు తన వ్యవహాలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. పీకేతో ఒకసారి సమావేశం కూడా జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే వైసీపీకి పీకే గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం సాగుతోంది. అయితే, తాజాగా ప్రశాంత్ కిషోర్‌ను తాము తీసుకోవడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే రాబిన్ శర్మ టీం పని చేస్తుండటం, కొత్తగా పీకే టీంను తీసుకోవడం ద్వారా చాలా సమీకరణాలు మారిపోయే అవకాశాలు ఉంటాయని సైకిల్‌ పార్టీ నేతలు చెప్పడంతో చంద్రబాబు ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిసింది. అయితే చంద్రబాబు వద్దని చెప్పడంతో ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికలకు జగన్‌కు పని చేస్తారని సమాచారం.

గత ఎన్నికల్లో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ బాగా కలిసి వచ్చంది. అయితే అప్పట్లో టీడీపీకి ఎలాంటి స్ట్రాటజీ టీమ్ లేదు. టీడీపీకి ఎప్పటి నుంచో పనిచేస్తున్న బ్యాక్ ఎండ్ టీమ్ ఇచ్చిన నివేదికలు ఆధారంగానే చంద్రబాబు నిర్ణయాలు తీసుకునేవారు. అయితే, పీకే టీం నివేదికలతో వైసీపీకి తిరుగులేని విజయాలు సాధించింది. దీంతో అదే టీమ్‌లో పనిచేసిన రాబిన్ సింగ్ ను టీడీపీ తన స్ట్రాటజీ టీమ్ గా పెట్టుకుంది. మరి పీకే టీమ్‌తో వైసీపీ, రాబిన్ సింగ్ టీమ్‌తో టీడీపీకి ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరంగా ఉంది. ఇలా రెండు పార్టీలు తమ తమ గెలుపు కోసం రకరకాల వ్యూహాలను రచిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరి పంథం నెగ్గుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News