బిక్కవోలు గణపతి సాక్షిగా.. వైసీపీ ఎమ్మెల్యే

అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి సతీసమేతంగా బిక్కవోలు గణపతి ఆలయం ఎదుట ప్రమాణానికి సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను ఆయన ఖండించారు. [more]

Update: 2020-12-23 02:56 GMT

అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి సతీసమేతంగా బిక్కవోలు గణపతి ఆలయం ఎదుట ప్రమాణానికి సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను ఆయన ఖండించారు. తాను అవినీతికి పాల్పడలేదని బిక్కవోలు గణపతి సాక్షిగా ప్రమాణం చేస్తానని సూర్యనారాయణరెడ్డి చెబుతున్నారు. తాను కూడా అవినీతి జరిగిందని ప్రమాణం చేస్తానని రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. ఇద్దరూ సతీసమేతంగా ప్రమాణానికి సిద్ధమయ్యారు. దీంతో బిక్కవోలు గణపతి ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News