బాలికలు, మహిళలను రేప్ చేసి చంపారు - రష్యా సైనికుల అకృత్యాలివీ !
చిన్నారులను కూడా వదలడం లేదని ఆమె ఆవేదన చెందారు. పదేళ్ల బాలికలపై రష్యా సైనికులు అత్యాచారాలు చేసి,
రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం పూర్తిగా ముగిసిపోలేదు. తమ సైనికులను వెనక్కి రప్పించినట్లు నటించింది రష్యా. తాజాగా ఉక్రెయిన్ ప్రజలపై రష్యా సైనికులు చేసిన ఆగడాలు, అకృత్యాలను ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యురాలు లెసియా వసిలెంక్ వెలుగులోకి తీసుకొచ్చారు. చిన్నారులను కూడా వదలడం లేదని ఆమె ఆవేదన చెందారు. పదేళ్ల బాలికలపై రష్యా సైనికులు అత్యాచారాలు చేసి, చంపేస్తున్నారని ట్వీట్ చేశారు. చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించినపుడు యోని, మల ద్వారాలపై గాయాలున్నట్టు ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
అలాగే మహిళల మృతదేహాలపై కాల్చిన స్వస్తిక్ గుర్తులున్నట్లు పేర్కొన్నారు. రష్యా దళాలు దోపిడీ, అత్యాచారాలు చేస్తూ ఉక్రెయిన్ ప్రజలను చంపేస్తున్నాయని, రష్యాను అనైతిక నేరాల దేశంగా ఆమె పేర్కొన్నారు. ఆరోపణలకు ఆధారంగా ఆమె ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. "అత్యాచారం చేసి చంపేసిన మహిళ మృతదేహం ఇది. మాటలు రావడం లేదు. నా మనస్సు కోపం, ద్వేషంతో స్తంభించిపోయింది" అని వసిలెంక్ ట్వీట్ లో పేర్కొన్నారు.