పుట్టా మధు భార్య శైలజను కూడా…?

న్యాయవాది వామనరావు దంపతుల కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే జడ్పీ ఛైర్మన్ పుట్టా మధును విచారించిన పోలీసులు ఆయన భార్య శైలజకు కూడా నోటీసులు ఇచ్చారు. [more]

Update: 2021-05-10 00:48 GMT

న్యాయవాది వామనరావు దంపతుల కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఇప్పటికే జడ్పీ ఛైర్మన్ పుట్టా మధును విచారించిన పోలీసులు ఆయన భార్య శైలజకు కూడా నోటీసులు ఇచ్చారు. వామనరావు దంపతుల హత్య కేసులో శైలజ ప్రమేయం ఉందని వామనరావు తండ్రి ఆరోపించారు. ఈకోణంలో దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. శైలజ ప్రస్తుతం మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. విచారణకు రావాలని శైలజకు నోటీసులు ఇచ్చారు. హత్య జరగడానికి ముందు రోజు పుట్టా మధు ఖాతా నుంచి రెండు కోట్లు విత్ డ్రా అయ్యాయి. దీనిపైన కూడా శైలజను ప్రశ్నించే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News