బాబుకు పవన్ ఫోన్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఫోన్ చేశారు. తాను వచ్చే నెల 3వ తేదీన విశాఖలో తలపెట్టిన ఇసుక కొరతపై ఆందోళనకు మద్దతివ్వాలని [more]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఫోన్ చేశారు. తాను వచ్చే నెల 3వ తేదీన విశాఖలో తలపెట్టిన ఇసుక కొరతపై ఆందోళనకు మద్దతివ్వాలని [more]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఫోన్ చేశారు. తాను వచ్చే నెల 3వ తేదీన విశాఖలో తలపెట్టిన ఇసుక కొరతపై ఆందోళనకు మద్దతివ్వాలని పవన్ కల్యాణ్ చంద్రబాబును కోరారు. దీనికి వెంటనే చంద్రబాబు అంగీకరించారు. ఇసుక కొరతతో భవన నిర్మాణకార్మికులు లక్షలాది మంది రోడ్డున పడినందున వారిని ఆదుకోవడంలో తమ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కల్యాణ్ తో చెప్పారు. అలాగే పవన్ కల్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు కూడా ఫోన్ చేసి ఆందోళనకు మద్దతు తెలపాలని కోరారు. ఇందుకు కన్నా లక్ష్మీనారాయణ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.