సోషల్ మీడియాను ఆ ఫొటోలతో హోరెత్తించండి… పవన్ పిలుపు

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఏపీలో అభివృద్ధి అనేది కన్పించకుండా పోయిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగుకో గుంత, గజానికో [more]

Update: 2021-09-01 06:22 GMT

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఏపీలో అభివృద్ధి అనేది కన్పించకుండా పోయిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా మారిందన్నారు. ఏపీలో ఏ రోడ్డు చూసినా అద్వాన్న స్థితిలో ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర పరిధిలో 1.20 లక్షల కిలోమీటర్లు రోడ్లు ఉన్నాయని, ఇవి దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ నెల 2,3,4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేయాలని పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మన రోడ్లు మనమే బాగు చేసుకుందామని చెప్పారు.

Tags:    

Similar News