పోలీస్ కమిషనర్ సంచలన నిర్ణయం.. ఆ ముగ్గురు అవుట్

అడ్డగూడూర్ లాకప్ డెత్ పైన పోలీస్ శాఖ సీరియస్ గా స్పందించింది . రాచకొండ పోలీస్ కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరియమ్మ కి లాకప్ డెత్ [more]

Update: 2021-07-21 03:54 GMT

అడ్డగూడూర్ లాకప్ డెత్ పైన పోలీస్ శాఖ సీరియస్ గా స్పందించింది . రాచకొండ పోలీస్ కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరియమ్మ కి లాకప్ డెత్ కి ముగ్గురు పోలీసు అధికారులను సర్వీసులు తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు . అడ్డగడూరు ఎస్ఐ మహేష్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ముగ్గురు అధికారులను పోలీస్ అధికారులను సర్వీస్ నుంచి తొలగించారు. ఇప్పటికే ఈ పోలీసు అధికారుల పైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మరొకవైపు పోలీస్ స్టేషన్ లో జరిగిన లాకప్ డెత్ పై జుడిషియల్ విచారణ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే మరియమ్మ మృతి పై ప్రజా సంఘాల ఆందోళన తీవ్రతరం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి నేరుగా బాధితులకు ఆర్థిక సాయం తో పాటు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై స్వయంగా డిజిపి పర్యవేక్షణ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు . ఇవన్నీ కొనసాగుతుండగానే రాచకొండ పోలీస్ కమిషనర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అడ్డ గూడూరు ఎస్.ఐ తో పాటుగా ఇద్దరు కానిస్టేబుల్ సర్వీస్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అడ్డగూడూరు ఎస్సై మహేశ్వర్ ,కానిస్టేబుల్ రషీద్ పటేల్, జనయ్య లను సర్వీసు నుంచి రాచకొండ పోలీస్ కమిషనర్ తొలగించారు. పోలీస్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఇద్దర్ని తొలగించినట్లు మహేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

Tags:    

Similar News