బ్రేకింగ్ : నిమ్మగడ్డ సంచలన నిర్ణయం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు భద్రత కల్పించాలంటూ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికలను సజావుగా [more]

Update: 2020-03-18 13:05 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు భద్రత కల్పించాలంటూ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు, ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ తనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ఆయన కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలను వాయిదా వేయడంతో తనపై వ్యక్తిగత దాడి జరిగే అవకాశముందని ఆయన భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ తనను వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో తనకు ప్రాణహాని ఉందని ఆయన కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒక ఎన్నికల కమిషనర్ తనకు భద్రత కల్పించాలంటూ కేంద్రానికి లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం కల్గిస్తుంది. 2014 ఎన్నికల్లో కేవలం కొన్ని మాత్రమే ఏకగ్రీవమయ్యాయని, ఇప్పుడు అనేక చోట్ల ఏకగ్రీవం అయ్యాయని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని, కేంద్ర బలగాలను పంపించాలని ఆయన హోంశాఖకు రాసిన లేఖలో కోరడం విశేషం. దీన్ని బట్టి రమేష్ కుమార్ ఏకగ్రీవం అయిన అన్ని ప్రాంతాల్లో తిరిగి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News