జగన్ ఆరోపణలపై నిమ్మగడ్డ ఏమన్నారంటే?

జగన్ తనపై చేసిన ఆరోపణలకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకే ఇళ్ల పట్టాల పంపిణీని నిలిపివేశారన్నారు. హైకోర్టు [more]

Update: 2020-03-15 13:27 GMT

జగన్ తనపై చేసిన ఆరోపణలకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి మేరకే ఇళ్ల పట్టాల పంపిణీని నిలిపివేశారన్నారు. హైకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఎన్నికల సంఘాన్ని చూడాలన్నారు. నిబంధనల ప్రకారమే తాను ఎన్నికలను వాయిదా వేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకే ఎన్నికలను వాయిదా వేశామన్నారు. కరోనా వైరస్ ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం తమకు తెలియజేసిందన్నారు. ఎన్నికల సంఘంపై దురుద్దేశ్యాలను ఆపాదించడం సరికాదన్నారు. ఆరు వారాల్లో తిరిగి ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన హింసకు సంబంధించి అనేక పార్టీల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులను బదిలీ చేశామన్నారు.

Tags:    

Similar News