నిమ్మగడ్డ రెడీ.. నేడు తొలిదశ నోటిఫికేషన్

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం పది [more]

Update: 2021-01-23 02:22 GMT

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఈ నెల 25వ తేదీన జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఎన్నికల నోటీసులను జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెబుతోంది. ఈ విషయాన్ని మరోమారు ఎస్ఈసీకి స్పష్టం చేసింది.

Tags:    

Similar News