నిమ్మగడ్డ కేసు రేపటికి వాయిదా

మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ వాదనలు విన్పించారు. స్టేట్ [more]

Update: 2020-05-07 12:09 GMT

మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ వాదనలు విన్పించారు. స్టేట్ ఎన్నికల కమిషనర్ సర్వీస్ నిబంధనలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఏజీ చెప్పారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆర్డినెన్స్ తెచ్చారనడం సరికాదన్నారు. ఎన్నికల సంస్కరణలో భాగంగానే ఆర్డినెన్స్ తెచ్చామని ఏజీ చెప్పారు. అయితే రాజ్యాంగ పదవిలో ఉన్న వారి పదవీకాలాన్ని తగ్గించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అని హైకోర్టు ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. కేసును రేపటికి వాయిదా వేసింది.

Tags:    

Similar News