నిమ్మగడ్డ కేసులో స్పీడ్ పెంచిన సీఐడీ
మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో సీఐడీ స్పీడ్ పెంచింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖ కు రాసిన లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? [more]
మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో సీఐడీ స్పీడ్ పెంచింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖ కు రాసిన లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? [more]
మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో సీఐడీ స్పీడ్ పెంచింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖ కు రాసిన లేఖ ఎక్కడి నుంచి వచ్చింది? అన్న దానిపై సీఐడీ ఆరా తీస్తుంది. ఇందులో భాగంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా ఉన్న సాంబమూర్తిని సీఐడీ అధికారులు విచారించారు. సికింద్రాబాద్ లో ఉంటున్న సాంబమూర్తి ఇంటికి చేరుకున్న సీఐడీ అధికారులు ఆ లేఖకు సంబంధించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖకు రాసిన లేఖ టీడీపీ కార్యాలయంలో తయారయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.