లోకేష్ అవుట్ ఫోకస్ అట.. కారణం ఇదే

నారా లోకేష్ సైడ్ అయిపోయాడు. మొన్నటి వరకూ దూకుడు మీద ఉన్న చినబాబు ఇప్పుడు కొద్దిగా వెనక్కు తగ్గాడు

Update: 2022-01-13 03:53 GMT

నారా లోకేష్ సైడ్ అయిపోయాడు. మొన్నటి వరకూ దూకుడు మీద ఉన్న చినబాబు ఇప్పుడు కొద్దిగా వెనక్కు తగ్గాడు. ఎన్నికలు దగ్గరపడే సమయం కొద్దీ చినబాబును కొంత బ్యాక్ ను పెడుతున్నట్లే కనిపిస్తుంది. నారా లోకేష్ టీడీపీకి భవిష్యత్ లో సారథ్యం వహించాలి. దానిని ఎవరూ కాదనరు. చంద్రబాబు తర్వాత పార్టీలో ఆయనదే రెండో స్థానం. అందులో నో డౌట్. ఇప్పుడిప్పుడే ఆయన రాజకీయంగా రాటుదేలుతున్నారు. ట్విట్టర్ కే పరిమితమయ్యారన్న విమర్శలున్నప్పటికీ దానికి లెక్క చేయకుండా తాను చెప్పాల్సింది చెబుతున్నారు. తిట్టాల్సింది తిట్టిపారేస్తున్నారు.

అప్పటి నుంచే....
చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి రావడం, తర్వాత పార్టీ కార్యలయంలో గుక్కపెట్టి ఏడ్వడం వంటి సంఘటన తర్వాత నారా లోకేష్ పార్టీ యాక్టివిటీస్ కు కొంత దూరంగా ఉంటున్నారు. ఆయన మంగళగిరి నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. అమరావతికి వచ్చినప్పుడల్లా లోకేష్ మంగళగిరిలో పర్యటిస్తున్నారు. అక్కడ నేతగా ఉన్న చిరంజీవిని కూడా చీరాలకు పంపేందుకు నారా లోకేష్ సిద్ధమయ్యారు.
చినబాబు జోక్యాన్ని....
ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు లోకేష్ జోక్యాన్ని పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారట. పూర్తిగా మంగళగిరిలో గెలవడంపైనే దృష్టి పెట్టాలని కోరారట. ఈసారి గెలవకుంటే రాజకీయంగా మరింత ఇబ్బందులు ఎదురవుతాయని, ఆలోచించుకోవాలని లోకేష్ కు చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయాల్లోనూ లోకేష్ జోక్యం లేకుండా చంద్రబాబు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ ఎన్నికలకు....
లోకేష్ పట్ల టీడీపీ క్యాడర్ లో మంచి అభిప్రాయమున్నా, ప్రజల్లో ఇంకా ఏర్పడకపోవడంపై లోకేష్ ను ఈ ఎన్నికలకు దూరంగా ఉంచనున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ, పొత్తుల అంశంపైన కూడా లోకేష్ జోక్యం ఉండబోదు. కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ సైకిల్ యాత్ర చేయాలని భావించినా అందుకు కూడా చంద్రబాబు అంగీకరించలేదని తెలిసింది. లోకేష్ ఫోకస్ అవ్వడానికి చంద్రబాబు ఇష్టపడటం లేదు. అందుకే చినబాబు సైకిల్ యాత్ర కూడా లేనట్లేనని అంటున్నారు.


Tags:    

Similar News