April26-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఈవీఎం, వీవీ ప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిపై దాఖలయిన అన్ని పిటీషన్లను కొట్టివేసింది. ఈవీఎం ద్వారా పోలయిన ఓట్లను వీవీ ప్యాట్ లతో సరిపోల్చాలంటూ దాఖలయిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పు తెలిపింది. పేపర్ బ్యాలట్ రూపంలో ఎన్నికలను నిర్వహించాలన్న పిటీషన్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Update: 2024-04-26 12:38 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Breaking : ఈవీఎంలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఈవీఎం, వీవీ ప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిపై దాఖలయిన అన్ని పిటీషన్లను కొట్టివేసింది. ఈవీఎం ద్వారా పోలయిన ఓట్లను వీవీ ప్యాట్ లతో సరిపోల్చాలంటూ దాఖలయిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పు తెలిపింది. పేపర్ బ్యాలట్ రూపంలో ఎన్నికలను నిర్వహించాలన్న పిటీషన్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Chandrababu : చంద్రబాబుపై సింపతీ ఎక్కువగా ఉందా? నమ్మకం పెరుగుతోందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ ఎన్నికల్లో సానుభూతి ఎక్కువగా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయా? ఏడుపదులు దాటిన వయసులో ఆయనకు ఒక్క అవకాశమిస్తే పోలా? అన్న సింపతీ జనాల్లో వస్తుందా? అంటే కొందరిలో అలాంటి అభిప్రాయమే వినిపిస్తుంది.

Elections : మే పదోతేదీన టిక్కెట్లన్నీ హాంఫట్.. సంక్రాంతి సెలవుల తరహాలోనే...ఊళ్లకు వెళ్లాలంటే సొంత వాహనాలపైనే?

మే పదోతేదీన హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ఆర్టీసీ, ప్రయివేటు బస్సుల్లో టిక్కెట్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. రైళ్లలో కూడా ఆరోజు అడ్వాన్స్ గా రిజర్వేషన్ చేయించుకోవడంతో అన్ని చోట్లకు వెయిటింగ్ లిస్ట్ కనపడుతుంది. వెయిటింగ్ లిస్ట్ వందల సంఖ్యలో ఉండటంతో ఇక రైళ్లలో టిక్కెట్ కన్ఫర్మ్ కావడం కష్టమేనని చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.

Paderu : ఇక్కడ గిడ్డి ఈశ్వరి గెలిస్తే హిస్టరీని క్రియేట్ చేసినట్లే.. ఒకసారి గెలిచినోళ్లకు ఇక్కడ నో ఛాన్స్

విశాఖ జిల్లాలోని గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గమైన పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పట్టుబట్టి మరీ టిక్కెట్ సాధించుకున్నారు. పట్టు అనేకంటే ఒకకరకంగా బ్లాక్ మెయిల్ చేసి టిక్కెట్ తెచ్చుకున్నారని అనుకోవాలి. తనకు టిక్కెట్ రానివ్వకుండా అచ్చెన్నాయుడు అడ్డుపడ్డాడంటూ ఏకంగా ఆమె టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే కామెంట్స్ చేశారు.

Harish Rao Resignation letter: రాజీనామా లేఖను వారికి ఇచ్చి వెళ్లిన హరీశ్

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తన రాజీనామాతో శుక్రవారం ఉదయం గన్ పార్క్ కు చేరుకున్నారు. ఆగస్టు 15 లోగా రైతు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై హరీశ్ రావు స్పందిస్తూ.. ఈ హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరాు.

IPL 2024 : హమ్మయ్య... ఇలా ఫస్ట్ నుంచి ఆడితే ఈ బాధ ఉండేది కాదు కదా సామీ?

డూ ఆర్ డై మ్యాచ్ లో బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ తన సత్తా చాటింది. సమిష్టిగా రాణిస్తే విజయం దరిచేరుతుందని ఈ మ్యాచ్ చూపించింది. వరస ఓటములతో బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగ పట్టుకుంది. ప్లే ఆఫ్ కు కూడా బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ రాదేమో అని దాని అభిమానులు నిరాశలో ఉన్నారు.

మే 1న ఇంటివద్దనే పింఛన్లు ఇవ్వండి

వచ్చేనెల మొదటి తేదీన ఇళ్ల వద్దనే పింఛన్లను పంపిణీ చేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, వికలాంగులు సచివాలయాలకు రాలేదరన్నారాయన. అందుకే గతంలో మాదిరిగా ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటి నుంచి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కోరారు.

TTD 2000 rupees notes: టీటీడీకి బిగ్ రిలీఫ్.. ఆ రెండువేల నోట్లన్నీ

తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద రిలీఫ్ లభించింది. హుండీలో వచ్చిన రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది. ఆర్బీఐ రెండు వేల నోట్లను తీసుకునేందుకు అంగీకరించడంతో యాభై కోట్ల రూపాయలు టీటీడీకి చేరనున్నాయి. గత ఏడాది అక్టోబరు 7వ తేదీ నంుచి రెండు వేల రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Renudesai : రేణుదేశాయ్ వెంటపడుతున్న జనసైనికులు

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ మాజీ సతీమణి రేణూదేశాయ్ పై జనసైనికులు ట్రోల్ చేస్తున్నారు. ఆమె చేసిన పోస్టుపై జనసేన పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న మాధవీ లతకు మద్దతుగా రేణుదేశాయ్ పోస్టు చేశఆరు. చాలా కాలం తర్వాత తాను ఒక స్ట్రాంగ్ ఉమెన్ ను చూశానంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Hyderabad : కారులో కోటి విలువైన వజ్రాభరణాలు మాయం

కారులో ఉన్న కోటి రూపాయల విలువైన వజ్రాభరణాలు మాయమయ్యాయి. ఈఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది. జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న భాగవతుల బాబ్జీ తన సతీమణితో కలసి బెంగళూరు నుంచి ఈనెల 20వ తేదీన హైదరాబాద్ కు చేరుకున్నారు.అక్కడి నుంచి నేరుగా రోడ్డు నెంబరు 71లోని తన నివాసానికి వెళుతూ మార్గమధ్యంలో విజేత సూపర్ మార్కెట్ వద్ద ఆగారు. నిత్యావసరాలు తీసుకెళ్లాలని ఆగిన ఆయన కారును ఆపడంతో పాటు డ్రైవర్ దానిని శుభ్రంచేసుకున్నాడు.


Tags:    

Similar News