Sun Feb 01 2026 06:03:02 GMT+0000 (Coordinated Universal Time)
TTD 2000 rupees notes: టీటీడీకి బిగ్ రిలీఫ్.. ఆ రెండువేల నోట్లన్నీ
టీటీడీకి రిలీఫ్ లభించింది. హుండీలో వచ్చిన రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది

TTD 2000 rupees notes:తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద రిలీఫ్ లభించింది. హుండీలో వచ్చిన రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది. ఆర్బీఐ రెండు వేల నోట్లను తీసుకునేందుకు అంగీకరించడంతో యాభై కోట్ల రూపాయలు టీటీడీకి చేరనున్నాయి. గత ఏడాది అక్టోబరు 7వ తేదీ నంుచి రెండు వేల రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే హుండీలో వచ్చిన దాదాపు మూడు కోట్ల రూపాయలను టీటీడీ మార్పిడిచేసుకుంది.
సమయం ముగియడంతో...
అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల నోట్ల రూపాయల మార్పిడి కోసం విధించిన తేదీ తర్వాత కూడా కొన్ని రెండు వేల రూపాయల నోట్లు తిరుమల హుండీలో చేరాయి. వాటి విలువ యాభై కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. అయితే సమయం మించిపోవడంతో దాని మార్పిడికి బ్యాంకులు అంగీకరించలేదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పదే పదే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తులు చేయడంతో ఎట్టకేలకు అంగీకరించింది. ఆ నోట్లను ఆర్బీఐ తీసుకోవడానికి అంగీకరించింది.
Next Story

