Fri Dec 05 2025 10:50:07 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : కారులో కోటి విలువైన వజ్రాభరణాలు మాయం
కారులో ఉన్న కోటి రూపాయల విలువైన వజ్రాభరణాలు మాయమయ్యాయి. ఈఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది

కారులో ఉన్న కోటి రూపాయల విలువైన వజ్రాభరణాలు మాయమయ్యాయి. ఈఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది. జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న భాగవతుల బాబ్జీ తన సతీమణితో కలసి బెంగళూరు నుంచి ఈనెల 20వ తేదీన హైదరాబాద్ కు చేరుకున్నారు.అక్కడి నుంచి నేరుగా రోడ్డు నెంబరు 71లోని తన నివాసానికి వెళుతూ మార్గమధ్యంలో విజేత సూపర్ మార్కెట్ వద్ద ఆగారు. నిత్యావసరాలు తీసుకెళ్లాలని ఆగిన ఆయన కారును ఆపడంతో పాటు డ్రైవర్ దానిని శుభ్రంచేసుకున్నాడు. తర్వాత ఇంటికెళ్లి ఈ నెల 24వ తేదీన సూట్ కేసులలో ఉన్న వజ్రాభరణాలు చూడగా అవి మాయమయ్యాయి.
కారు శుభ్రం చేయడానికి...
ఇది గమనించిన భాగవతుల బాబ్జీ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు డిక్కీలో ఉన్న సూట్ కేసుల్లో నుంచి వజ్రాలు మాయమయ్యాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ నెల 20వ తేదీన బాబ్జీ సూట్ కేసులు తెరవలేదు. 24వ తేదీ తెరిచిచూడగా వజ్రాభరణాలు కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూట్ కేసులో మూడు డైమండ్ నెక్లెస్ లతో పాాటు, మూడు జతల డైమండ్ చెవి రింగులున్నాయని వీటి విలువ కోటి రూపాయలు ఉంటుందని భాగవతుల బాబ్జీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

