April13-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

రేపు సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొననున్నారు. పార్లమెంటు స్థానాలకు పోత చేస్తున్న పథ్నాలుగు మంది అభ్యర్థులు, నియోజకవర్గ ఇంఛార్జీలతో సీనియర్ నేతలు భేటీకానున్నారు.

Update: 2024-04-13 13:04 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Congress : రేపు కాంగ్రెస్ నేతల సమావేశం.. గెలుపు దిశగా

రేపు సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొననున్నారు. పార్లమెంటు స్థానాలకు పోత చేస్తున్న పథ్నాలుగు మంది అభ్యర్థులు, నియోజకవర్గ ఇంఛార్జీలతో సీనియర్ నేతలు భేటీకానున్నారు.

Ap Politics : గెలిచాక మంత్రి అవుతారేమో.. ఎన్నికల్లోనే ఓడిస్తే పోలా.. ఇదీ ఏపీలో లేటెస్ట్ సీన్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరో నెలరోజులు ఉన్నాయి. సరిగ్గా వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే.. అన్ని పార్టీల్లో కీలక నేతలను ఓడించేందుకు కోవర్టుగా మారడమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

IPL 2024 : ఒక్కడు క్లిక్ అయితే చాలు.. మ్యాచ్ మన చేతికి వచ్చినట్లే.. కీలక సమయంలో కావాలిగా

ఐపీఎల్‌లో మ్యాజిక్ లకు మాత్రమే చోటుంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నపళంగా అంచనాలు లేని ప్లేయర్లు ఇరగదీసి ఆడతారు. అంచనాలు అధికంగా ఉన్న ఆటగాళ్లు డకౌట్లు అయి నిరాశపరుస్తారు. ఎంత స్కోరు చేశామని కాదు.. ఎన్ని వికెట్ల పడగొట్టామన్నది కూడా ఐపీఎల్ లో ముఖ్యమేనంటారు.

Nallari : నల్లారి గెలుపు నల్లేరు మీద నడక కాదు.. ఎందుకంటే.. రెండు ఓట్లు.. రెండు గుర్తులు.. అదే ఇబ్బందా?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇది ఒకరకంగా ఆఖరి ఎన్నిక. ఇప్పటికే పదేళ్ల నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ అటూ ఇటూ అయితే మాత్రం ఆయన శాశ్వతంగా హైదరాబాద్ కే పరిమితమయిపోతారు. ఈసారి రాజంపేట నుంచి పార్లమెంటు బరిలో నిలబడి తన లక్ ను పరీక్షించుకుంటున్నారు.

Janasena : ఈ జబర్దస్త్ బ్యాచ్ ఎందుకు జానీ.... కామెడీ పీసులు .. సామీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎన్నికల్లో కూడా సినీ వాసన పోలేదనిపిస్తుంది. ఎందుకంటే ఆ మధ్య ఆయన విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను చూస్తేనే అర్థమవుతుంది. పాలిటిక్స్ అంటే నవ్వులు కాదు.. సీరియస్ నెస్ ఉండాలి. కానీ పవన్ కల్యాణ్ జబర్దస్త్, ఢీ వంటి బుల్లి తెరపై కనపించే వారందరినీ తీసుకొచ్చి స్టార్ క్యాంపెయినర్లుగా జనంలోకి వదిలారు. వాళ్లు ప్రచారంలో ఏమాత్రం పనికి వస్తారో తెలియదు కానీ..

తీహార్ జైలు నుంచి మరో లేఖ

తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖను బయటకు విడుదల చేశారు. తీహార్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు సకల సౌకర్యాలను అనుభవిస్తున్నారని తెలిపారు. తనను జైలులో కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు. జైలు అధికారులు కూడా కొందరు వారితో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.

KTR : రేపు ఢిల్లీకి కేటీఆర్.. కవితను కలిసేందుకే హస్తినకు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన తన సోదరి కవితను కలిసేందుకు ఢిల్లీకి వెళుతున్నారు. సీబీఐ కార్యాలయంలో కవితను కేటీఆర్ కలిసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత అరెస్టయి దాదాపు నెల రోజులు కావస్తుండటంతో ఆమెతో భేటీ అయి కుటుంబ విషయాలను చర్చించనున్నారు.

Inter Result : తెలంగాణలో ఇంటర్ రిజల్ట్ ఎప్పుడంటే?

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. కానీ తెలంగాణలో ఫలితాలు విడుదల కాలేదు. ఇప్పటికే ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తయిందంటున్నారు. లక్షల మంది తెలంగాణలో ఇంటర్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా విడుదల చేసే అవకాశముందని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెబుతున్నారు.

షర్మిలా నువ్వు నోరు మూసుకుంటే మంచిది : విమలమ్మ

వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలమ్మ తీవ్ర విమర్శలు చేశారు. ఇద్దరూ వైఎస్ కుటుంబం పరువును బజారు కీడుస్తున్నారన్నారు. అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డిని చంపుతుండగా వీళ్లిద్దరూ చూశారా? అంటూ ఆమె ప్రశ్నించారు. లేని పోని నిందలు వేయడం తగదన్నారు.

Rahul Gandhi : ప్రియమిత్రుడి కోసం స్వీట్లు కొన్న రాహుల్ గాంధీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. అయితే ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఒక గిఫ్ట్‌ను కొనుగోలు చేశారు. ఒక మిఠాయి దుకాణంలోకి వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ మైసూర్ పాక్ ను ప్రత్యేకంగా ప్యాక్ చేయించారు.


Tags:    

Similar News