Fri Sep 13 2024 08:39:24 GMT+0000 (Coordinated Universal Time)
KTR : రేపు ఢిల్లీకి కేటీఆర్.. కవితను కలిసేందుకే హస్తినకు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన తన సోదరి కవితను కలిసేందుకు ఢిల్లీకి వెళుతున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన తన సోదరి కవితను కలిసేందుకు ఢిల్లీకి వెళుతున్నారు. సీబీఐ కార్యాలయంలో కవితను కేటీఆర్ కలిసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత అరెస్టయి దాదాపు నెల రోజులు కావస్తుండటంతో ఆమెతో భేటీ అయి కుటుంబ విషయాలను చర్చించనున్నారు.
సీబీఐ కస్టడీలోకి...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేటి నుంచి సీబీఐ కస్టడీలో విచారణను ఎదుర్కొననున్నారు. మూడు రోజుల పాటు కవితను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో నేటి నుంచి ఆమె సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే ఉండనున్నారు. అందుకోసమే కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కవితను కలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story