Mon Feb 02 2026 07:46:43 GMT+0000 (Coordinated Universal Time)
Congress : రేపు కాంగ్రెస్ నేతల సమావేశం.. గెలుపు దిశగా
రేపు సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది

రేపు సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొననున్నారు. పార్లమెంటు స్థానాలకు పోత చేస్తున్న పథ్నాలుగు మంది అభ్యర్థులు, నియోజకవర్గ ఇంఛార్జీలతో సీనియర్ నేతలు భేటీకానున్నారు.
ప్రచారంపై...
రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు ఏం చేయాలన్న దానిపై నేతలను అడిగి ఆయన తెలుసుకోనున్నారు. అంతేకాకుండా పార్టీ అగ్రనేతల ప్రచారం ఎప్పుడు? ఎక్కడ? ఉండాలన్న దానిపైన కూడా రేపటి సమావేశంలో స్పష్టత రానుంది.
Next Story

