సీఎం కేసీఆర్ కుర్చీ కదులుతోంది

బండి సంజయ్ పాదయాత్రతో సీఎం కేసీఆర్ కుర్చీ కదలడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాదయాత్ర ప్రారంభోత్సవ సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. బండి [more]

Update: 2021-08-28 07:25 GMT

బండి సంజయ్ పాదయాత్రతో సీఎం కేసీఆర్ కుర్చీ కదలడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాదయాత్ర ప్రారంభోత్సవ సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ ప్రజలు అండగా నిలవాలని కిషన్ రెడ్డి కోరారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించాలన్నారు. కేసీఆర్ ధనికమైన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఏవర్గం ప్రజలు సంతోషంగా లేరన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదన్నారు. ప్రజాసంగ్రామ యాత్రతో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.

Tags:    

Similar News