కర్ణాటకలో జరుగుతున్న మరో ఎన్నికలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? కర్ణాటకలోని జయనగర్ ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇక్కడ తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కర్ణాటకలోని జయనగర్ స్థానానికి బీజేపీ అభ్యర్థి మృతితో తిరిగి ఎన్నిక నిర్వహించారు. ఇక్కడ పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యనే ఉంది. ఇటీవల జరిగిన ఆర్ఆర్ నగర్ లోనూ కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో కూడా విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీకి 80 స్థానాలు దక్కుతాయి. తొలిరౌండ్ లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.