డీకే వయసుకు.. కొట్టే షాట్లకు...?

2006 లో దినేష్ కార్తీక్ భారత్ జట్టులోకి టీ 20 ఆడటానికి ప్రవేశించాడు. టీ 20లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు.

Update: 2022-06-18 03:38 GMT

2006 లో దినేష్ కార్తీక్ భారత్ జట్టులోకి టీ 20 ఆడటానికి ప్రవేశించాడు. టీ 20లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఫలితంగా జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. దినేష్ కార్తీక్ పట్టుదలతో చేసిన కృషి, ఆయన పడిన శ్రమ 37 ఏళ్ల వయసులో సాధ్యమయింది. ఇది ఒక అరుదైన విషయంగా క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. 37 సంవత్సరాల వయసులో తిరిగి భారత్ జట్టులోకి ప్రవేశించి టీం ఇండియాకు విజయం అందించిన ఆటగాడుగా దినేష్ కార్తీక్ అందరి ప్రశంసలను పొందుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో తొలి అర్థశతకాన్ని సాదఇంచాడు.

ఐపీఎల్ లో రాణించి..
దినేష్ కార్తీక్ ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ లో బెంగళూరు తరుపున ఆడాడు. డెత్ ఓవర్స్ లో అత్యధిక పరుగులు తీసే ఆటగాడిగా మారాడు. చివరలో వచ్చి జట్టును గెలిపించడం దినేష్ కార్తీక్ ప్రత్యేకత. అందుకే దక్షిణాఫ్రికాతో జరిగిన టీ 20 సిరీస్ కు దినీష్ కార్తీక్ ను ప్రత్యేకంగా బీసీసీఐ ఎంపిక చేసింది. జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నప్పటికీ దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకోవడానికి ప్రధాన కారణం డెత్ ఓవర్లలో పరుగులు సాధించడమే.
తిరిగి ఇండియా జట్టుకు...
బీసీసీఐ నమ్మకాన్ని దినేష్ కార్తీక్ నిలబెట్టాడు. నిజానికి దినేష్ కార్తీక్ తో ఇండియా జట్టులో ఆడిన వారంతా రిటైర్ అయిపోయారు. దినేష్ కార్తీక్ మాత్రం ఇంకా తనలో పస తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. నిన్న రాజ్ కోట్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లోనూ దినేష్ కార్తీక్ వల్లనే జట్టు సునాయాసంగా గెలిచింది. చివరి ఐదు ఓవర్లలో హార్థిక్ పాండ్యాతో కలసి 73 పరుగులు సాధించాడు. సిక్సర్లు, ఫోర్లతో గ్రౌండ్ మొత్తం మోత మోగించాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. కేవలం 27 బంతుల్లోనే 55 పరుగులు సాధించి ఇండియా గెలుపునకు కారణమయ్యాడు. ఇండియా సిరీస్ ఆశలు సజీవంగా నిలిపాడు.


Tags:    

Similar News