హర్యానాలో ఉద్రిక్తత

హరియాణ రణరంగంగా మారింది. మతపరంగా సున్నిత జిల్లా అయిన హరియాణ నుహ్‌లో హిందూ సంఘాలు (ఈరోజు) సోమవాం రోజు శోభా యాత్రను నిర్వహించాలని ప్లాన్ చేశాయి

Update: 2023-08-28 16:20 GMT

రణరంగంగా మారిన హర్యానా

హరియాణ రణరంగంగా మారింది. మతపరంగా సున్నిత జిల్లా అయిన హరియాణ నుహ్‌లో హిందూ సంఘాలు (ఈరోజు) సోమవాం రోజు శోభా యాత్రను నిర్వహించాలని ప్లాన్ చేశాయి. జూలై 31న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నిర్వహించిన ఊరేగింపుపై ఓ వర్గం దాడి చెయ్యడంతో హింసకు దారితీసింది. ముస్లింలు మెజారిటీగా ఉన్న నుహ్‌లో జరిగిన ఘర్షణల్లో ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు హోమ్ గార్డులు, ఓ ముస్లీం మతపెద్ద కూడా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో నుహ్ లో జరిగిన గొడవలు గురుగ్రామ్ కు వ్యాపించడంతో హరియాణలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

భారీగా పోలీసుల మోహరింపు

నిరసనలకు ప్రతిస్పందనగా హరియానా ప్రభుత్వం జిల్లాలో 1,900 మంది పోలీసు సిబ్బందిని, 24 కంపెనీల పారామిలటరీ బలగాలను అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వెంట మోహరించడం ద్వారా జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేసింది. జి20 షెర్పా గ్రూప్ సమావేశం సెప్టెంబర్ 3 నుంచి 7 వరకు నుహ్‌లో జరగనుంది.

దీంతో హరియాణలో శాంతిభద్రతలను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర యంత్రాంగం వీహెచ్ పీ శోభా యాత్రకు అనుమతి నిరాకరించింది. ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలో నిషేధాజ్ఞలు అమలు చేశారు. బయటి వ్యక్తులు జిల్లాలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించబడింది. విద్యా సంస్థలు, బ్యాంకులు మూతపడ్డాయి. మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎమ్ఎస్ సేవలు నిలిపివేశారు.

జూలై నుండి మరింత మత ఘర్షణలను నివారించడానికి జిల్లాలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడడం కూడా144 సెక్షన్ అమలు చేశారు. గురుగ్రామ్‌లోని సోహ్నా టోల్ వద్ద పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పరిపాలన భద్రతా ఏర్పాట్లలో భాగంగా హరియానాలో పోలీసులు టోల్ గుండా వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు.

సమీప గుడులకు వెళ్లాలని సీఎం సూచన



జూలైలో మతపరమైన అల్లర్ల కారణంగా శోభా యాత్రకు అంతరాయం ఏర్పడిన తర్వాత ఈరోజు మళ్లీ శోభా యాత్రను పునఃప్రారంభించాలని సర్వ రాష్ట్రీయ హిందూ మహాపంచాయత్ ఆగస్టు 13న పిలుపునిచ్చింది. కానీ పోలీసు అధికారులు దీనికి అనుమతులు ఇవ్వలేదు.

హరియానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజలు ఊరేగింపులో పాల్గొనకుండా సమీపంలోని దేవాలయాలను సందర్శించి ప్రార్థనలు చేయాలని, శోభా యాత్రకు బదులుగా ప్రజలు జలాభిషేకం కోసం తమ ప్రాంతాలలోని దేవాలయాలను సందర్శించవచ్చన్నారు.

అనుమతులకు పోలీసుల నిరాకరణ

అయితే వీటికి అధికారులు అనుమతి నిరాకరించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 28 పవిత్ర శ్రావణ మాసంలో చివరి సోమవారం. హిందూ సంఘాలు మాత్రం ఈరోజు శోభా యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 393 మందిని హరియానా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో 118 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News