మరో బూతు బాబా దొరికాడు

Update: 2018-07-22 02:30 GMT

హర్యానా రాసలీలల బాబాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. గతంలో డేరా బాబా ఉదంతం మరువకముందే తాజాగా మరో బాబా భాగోతం బట్ట బయలు అయ్యింది. దాంతో తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు సదరు బాబాను అరెస్ట్ చేసి లోపలేశారు. ఇంతకీ ఎవరీ బాబా ఏమా కథా అంటే...

120 కి పైగా అత్యాచారాలు ...

హర్యానా లోని ఫతేపూర్ తోహనా పట్టణంలో బాబా అమర్ పూరి ఉంటున్నాడు. భక్తి కార్యక్రమాల ముసుగులో ఆయన చేసేవన్నీ ఘోరాలే. ఆధ్యాత్మిక ముసుగులో వందమందికి పైగా మహిళలపై బాబా అత్యాచారాలకు తెగబడ్డాడు. ఇన్ని ఘోరాలు చేసినా ఇంతకాలం దర్జాగా చలామణి కావడం వెనుక బాబా బెదిరింపులు కారణమట. అయితే ఒక బాధితురాలు బాబా భాగోతం మొత్తం వీడియో ద్వారా పోలీసుల ముందు పెట్టడంతో బండారం బయటకొచ్చేసింది. దాంతో అవాక్కయిన పోలీసులు అమర్ పూరి పై నిర్భయ చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్లు బలంగా పెట్టి కటకటాల వెనక్కి పంపారు. దీనిపై బాబా పోలీసులకు లంచాలు ఇవ్వనందునే తనను కేసులో ఇరికించారని చెప్పడం కొసమెరుపు.

Similar News