గత ఆరు నెలల్లో మూడు పడవ ప్రమాదాలు జరిగాయని, లైసెన్సులు లేని బోట్లు నడుస్తొంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గోదావారిలో పడవ ప్రమాదం పట్ల ఆయన దిగ్ర్భాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం నిద్రపోతుందా అని ప్రశ్నించారు. ప్రమాదాలను నివారించలేని ముఖ్యమంత్రిపై హత్య కేసు పెట్టాలన్నారు జగన్.